సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగింది రంభ. ఆమె హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించారు. ఇండియా వైడ్ ఆమెకు పాపులారిటీ ఉంది. స్టార్ హీరోయిన్ గా రాణించిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు.రంభ అసలు పేరు విజయలక్ష్మి కాగా విజయవాడలో పుట్టింది. 1992లో విడుదలైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అనతి కాలంలో ఎదిగిన రంభ స్టార్స్ చిత్రాల్లో నటించింది.కాగా రజినీకాంత్ తో ఆమె ఒక్క చిత్రం మాత్రమే చేసింది. 1997లో విడుదలైన అరుణాచలం భారీ విజయం సాధించింది. ఆ మూవీలో సౌందర్య మెయిన్ హీరోయిన్ కాగా రంభ సెకండ్ హీరోయిన్ గా చేసింది. రజినీకాంత్ కి ఆమె పర్సనల్ సెక్రెటరీ రోల్ లో కనిపించింది. ఈ సినిమా సెట్స్ లో రజినీకాంత్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నానని రంభ సంచలన విషయం బయటపెట్టింది.
అరుణాచలంతో పాటు సల్మాన్ ఖాన్ బంధన్ మూవీలో రంభ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకున్నాయట. మార్నింగ్ షిఫ్ట్ ఒక మూవీలో ఈవెనింగ్ షిఫ్ట్ మరొక చిత్రంలో రంభ నటించేవారట. ఒకరోజు రజినీకాంత్ ని కలిసేందుకు సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ అరుణాచలం సెట్స్ కి వచ్చారట. సల్మాన్ ఖాన్ ని చూసిన రంభ పరుగున వెళ్లి కౌగిలించుకుని విష్ చేసిందట.అది దూరం నుండి రజినీకాంత్ చూశారట. సల్మాన్ వెళ్ళిపోయాక సెట్స్ లో గందరగోళం నెలకొందట. రజినీకాంత్ కోపంతో ఊగిపోతూ టవల్ విసిరి కొట్టాడట. దర్శకుడు సుందర్ సీ కూడా రంభ వైపు అలా చూశాడట. కెమెరా మెన్ వచ్చి ఏంటమ్మా ఇలా చేశావ్? ఇకపై రజినీకాంత్ మీతో నటించను అంటున్నాడని, అన్నాడట. దాంతో రంభ భోరున ఏడ్చేసిందట. తర్వాత రజినీకాంత్ సెట్స్ లో రంభ సల్మాన్ ఖాన్ ని చూసి ఎలా పరుగున వెళ్లి కౌగిలించుకుందో స్వయంగా చేసి చూపించాడట. అది నార్త్ ఇండియా స్టైల్ సార్, అని రంభ చెప్పారట. నెక్స్ట్ డే సెట్స్ లో అందరినీ వరుసగా నిల్చోబెట్టి నార్త్ ఇండియా స్టైల్ లో విష్ చేయాలని రంభను రజినీకాంత్ ఆటపట్టించాడట. నిజంగానే రజినీకాంత్ రంభతో మరలా సినిమా చేయలేదు.