రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ మంచి హిట్ అందుకుంది. దాంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి భవిష్యత్‌లో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఆ ఇద్దరు స్టార్లకు తాను అభిమానినన్నారు. త్వరలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa