హాట్ అప్పీల్ తో కవ్వించింది అమైరా దస్తూర్. నటించిన తొలి సినిమాతోనే కుర్రకారులోకి చొచ్చుకుపోయింది. మంజుల దర్శకత్వం వహించిన `మనసుకు నచ్చింది` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ చిత్రంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించాడు. కానీ తొలి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. పైగా ఆ సినిమాలో పక్కింటమ్మాయి తరహా పాత్రలో నటించడం అమైరా మైలేజ్ కి అడ్డంకిగా మారింది. మొదటి సినిమా తర్వాత ఎవరూ పిలిచి అవకాశం ఇచ్చిందే లేదు. అందుకే ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉనికిని కోల్పోయి కొత్త పరిశ్రమల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో అమైరా దస్తూర్ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా ఓ అవార్డుల వేడుకలో అమైరా దస్తూర్ వేడెక్కించే లుక్ లో ప్రత్యక్షమై అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. అమైరా ఈ కొత్త ఫోటోషూట్ లో మునుపటి కంటే హాట్ గా కనిపించింది. అందమైన నవ్వుతో కుర్రకారు గాలం వేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కెరీర్ ని పరిశీలిస్తే.. 2019లో ఈ అమ్మడు ఓ రెండు హిందీ చిత్రాల్లో - ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో `ఊడి ఊడి ఉజైకానుమ్` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో మెంటల్ హై క్యా మేడ్ ఇన్ చైనా చిత్రాల్లో ఆడిపాడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa