శర్వానంద్ త్వరలో తండ్రి కానుండడంతో ఆనందంలో ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్న భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ జంటకు బిడ్డ పుట్టబోతుండడంతో శర్వా యూఎస్‌లో ఆమె పక్కనే ఉన్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, శ్రీవిష్ణుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'సామాజవరగమన' చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ అబ్బరాజుతో శర్వా ఒక సినిమాకి సంతకం చేశాడు. ఈ చిత్రం 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.