కొత్త సంవత్సరం వచ్చేసింది. అయితే, 2024లో చాలామంది టాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఈ ఏడాది పెళ్లి చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే, రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఇక సంయుక్తా మీనన్, పాయల్ రాజ్పుత్, అవికాగోర్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.