టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఫిబ్రవరి 2వ వారంలో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారట.