టాలీవుడ్ ఫేమస్ సింగర్ సునీత కుమారుడు తనయుడు ఆకాశ్ గోపరాజు వెండితెరకు పరిచయమయ్యాడు. సర్కారీ నౌకరి తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ, కథనాలతో మొదటి తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ఆకాశ్ గోపరాజు.నూతన సంవత్సరం కానుకగా ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదలైన సర్కారు నౌకరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సామాజిక సందేశానికి కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి గంగనమోని శేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆర్‌కే టెలిషో పతాకంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సర్కారు నౌకరి ను నిర్మించడం విశేషం. ఈ తోనే భావన హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇందులో తనికెళ్ల భరణి, మధులత, మహదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎయిడ్స్, కండోమ్‌లపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ లో ఆకాశ్ గోపరాజు నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న సర్కారు నౌకరి ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆకాశ్ గోపరాజు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో గణతంత్ర దినోత్సవం కారణంగా జనవరి 26 నుంచి సర్కారు నౌకరి ను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే వచ్చేస్తుందన్నమాట.
సర్కారు నౌకరి కథ విషయానికి వస్తే.. ఇందులో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగం చేస్తుంటాడు గోపాల్ (ఆకాశ్ గోపరాజు). కండోమ్స్ పంచే జాబ్ చేసే అతనికి సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) కూడా అతనికి ఎందుకు దూరమైంది? అన్నది ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సర్కారు నౌకరి ను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వేచి చూద్దాం.