ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది...

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2019, 06:08 PM

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితచరిత్రగా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ .. కోకాపేటలో వేసిన 'బీదర్' కోట సెట్లో, ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 9వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ కారణంగానే యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చెబుతున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa