త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో రూపొందిన 'సూపర్ డీలక్స్' సినిమా నిన్ననే తమిళనాట విడుదలైంది. విజయ్ సేతుపతి .. సమంత .. రమ్యకృష్ణ .. పహాద్ ఫాజిల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చేసుకుంది. ఈ సినిమాలో హిజ్రాగా విజయ్ సేతుపతి .. వేశ్యపాత్రలో రమ్యకృష్ణ .. 'వేంబు' అనే పాత్రలో సమంత నటించారు.
ఈ ముగ్గురి నటన చూడటానికి ఈ సినిమాకి వెళ్లిపోవచ్చనే మాట తమిళనాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సమంత కెరియర్లోనే అద్భుతంగా చేసిన పాత్రల జాబితాలో ఈ సినిమాలోని పాత్ర ముందుగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె నటన అద్భుతమంటూ అక్కడి క్రిటిక్స్ ప్రశంసిస్తూ రాస్తున్నారు. తమిళ చిత్రపరిశ్రమలో సమంతను మరికొన్నాళ్లు నిలబెట్టే సినిమా ఇదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa