శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా 'మజిలీ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా, రేపే ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా కోసం 200 థియేటర్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది.
పెళ్లి తరువాత చైతూ .. సమంత కలిసి చేసే మొదటి సినిమా కావడం .. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం .. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ శనివారం సెలవు రోజు కావడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ నటించిన సంగతి తెలిసిందే. ఈ అమ్మాయి గ్లామర్ .. గోపీసుందర్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. ఇక ఇదే బ్యానర్లో దర్శకుడు శివ నిర్వాణ మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తుండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa