ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో డబ్బింగ్ చిత్రం సిద్ధమవుతున్నది. మలయాళ ఆగ్ర నటుడు మోహన్ లాల్, ప్రియమణి, అనశ్వర రాజన్,సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించిన ఆ చిత్రం నేరు. దృశ్యం 1,2 వంటి సినిమాలను రూపొందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మలయాళం నుంచి తరుచూ, అధికంగా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ కాకుండా కోర్టు డ్రామా జానర్‌లో రూపొందిన ఈ చిత్రం గత డిసెంబర్ 21న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయం సాధించి 2023 సంవత్సరానికి గ్రాండ్‌గా ముగింపు పలికింది. ఇక కథ విషయానికి వస్తే.. సారా అహ్మద్ అనే అంధురాలిని ఓ అగంతకుడు అత్యాచారం చేసి పారి పోతాడు. పొలీసులు అతన్ని కనిపెట్టలేక పోవడంతో స్వతహాగా శిల్పి అయిన బాధితురాలే అత్యాచారం చేసిన వ్యక్తి రూపాన్ని తయారు చేస్తుంది. దాని ఆధారంగా పొలీసులు ముంబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు మైఖేల్ జోసెప్‌ను అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో కేసును వాధించడానికి అపజయమే లేని రాజశేఖర్ అనే లాయర్‌ను వ్యాపారవేత్త నియమించుకుని బెయిల్‌పై నిందితుడిని బయటకు తీసుకువస్తారు. ఇదిలాఉండగా తనపై ఎంత ఒత్తిడి వస్తున్నా,ఓవరెన్ని బెదిరింపులు చేస్తున్నా సదరు భాదితురాలు ఈ కేసు పైనే పోరాటం చేయాలని అనుకుంటుంది. ఓ పొలీస్ ఆఫీసర్ సూచనతో విజయ్ మోహన్ అనే లాయర్ దగ్గరికి ఈ కేసు వెళ్లడంతో ఆయన కుదరదు అంటూనే అ అమ్మాయి తరుపున కేసు వాదించడం మొదలు పెడతాడు. ఈక్రమంలో అత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకున్నారా, మధ్యలో ప్రియమణి ఎంట్రీ తదితర ఇంట్రెస్టింగ్ డ్రామాతో సినిమా ఆకట్టుకుంటుంది. చివరకు నిందితుడిని ఎలా పట్టుకున్నారనే కథతో సినిమా రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా జనవరి 23 (సోమవారం) నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హాందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.