టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం గురించి మీడియాతో మాట్లాడారు. బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ ద్వారా సినిమాపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం గురించి నిర్మాత మాట్లాడారు.
తల్లీ కొడుకుల బంధాన్ని హైలైట్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాగా సినిమాను ప్రమోట్ చేసి ఉండాల్సిందని నాగ వంశీ అన్నారు. గుంటూరు కారం మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అన్నారు. దీనికి తోడు 1 AM షోల స్క్రీనింగ్ మొదట్లో టాక్‌ని ప్రభావితం చేసిందని నాగ వంశీ అన్నారు. మొదట్లో కొంచెం ఆందోళన ఉంది కానీ కుటుంబ ప్రేక్షకులు మరియు సాధారణ ప్రేక్షకులు తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ను పూర్తిగా ఆదరించారు అని యువ నిర్మాత చెప్పారు.
ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు .ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.