జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'నెరు' సినిమా డిసెంబర్ 21న విడుదల అయ్యింది. ఈ కోర్టు రూమ్ డ్రామా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నెరు యొక్క డిజిటల్ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రం జనవరి 23 నుండి స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
ఈ సినిమాలో మోహన్ లాల్ క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆంటోని పెరుంబావూర్ మరియు ప్రియామణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెరు చిత్రాన్ని మోహన్‌లాల్ స్వంత బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తుంది.