ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టర్ టాక్: 'మహర్షి' లో మహేష్ బాబు మహా స్టయిలిష్ గా ఉన్నాడే!

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2019, 12:18 PM

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ తాజా చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకు వచ్చిన మహేశ్ పోస్టర్స్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్లో  కార్పొరేట్ స్టైల్ బిజినెస్ మేన్ లుక్ తో కనిపిస్తూ మహేశ్ బాబు మరింతగా ఆకట్టుకుంటున్నాడు. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకి ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తాజా పోస్టర్ ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఈ టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా శ్రద్ధ తీసుకున్నారట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa