టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికి మంచి పేరు తెచ్చుకుంది అమలా పాల్. అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో నాయక్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తరువాత కొన్ని తెలుగు సినిమాలు చేసినప్పటికి పెద్దగా విజయం సాధించలేదు. తరువాత తమిళం, మలయాళంలో సినిమాలు చేసిన అమలా పాల్... ఇప్పుడు నిర్మాతగా మారి ఓ సినిమా ప్లాన్ చేసింది.
కడవేర్ అనే టైటిల్ తో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సినిమాను ప్లాన్ చేసింది అమలాపాల్. ఇందులో ఆమె కీ రోల్ చేస్తోంది. తన మేనేజర్ ప్రదీప్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa