ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ మొత్తానికి అమ్ముడయిన 'సరిపోదా శనివారం' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2024, 03:24 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 23 కోట్లకి అమ్ముడయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రం SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com