తమిళ నటుడు శ్రీరామ్ నటించిన లేటెస్ట్ హారర్ మూవీ పిండం. సాయికిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు. గత ఏడాది డిసెంబర్ 15 న రిలీజ్ అయిన ఈ మూవీ కి థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ మరియు రవి వర్మ లాంటి వాళ్లు ముఖ్య పాత్రలు పోషించారు.బాక్సాఫీస్ వద్ద పిండం మూవీ పర్వాలేదనిపించుకుంది.ఇదిలా ఉంటే పిండం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఒకేసారి రెండో ఓటీటీల్లో కావడం విశేషం. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ మూవీ.. శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది.పిండం మూవీని ప్రస్తుతంతోపాటు 1990 మరియు 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరిగిన కథగా తెరకెక్కించారు.
పాడుబడిన పాత ఇంట్లోకి హీరో ఫ్యామిలీ రావడం, అందులో ఆత్మలు ఉండటం, వాటి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం అన్నది హారర్ సినిమాల్లో ఎవర్‌గ్రీన్ ఫార్ములా. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ ఫార్ములాలో చాలా సినిమాలొచ్చాయి. ఇప్పటికీ ఈ ఫార్ములా తో దర్శకులు కథలు రాస్తూనే ఉన్నారు. పిండం ఆ కోవకు చెందిన సినిమానే. కానీ కామెడీ, హీరోయిజం లాంటి అంశాలతో మిక్స్ చేయకుండా ప్యూర్ హారర్ మూవీగా పిండం సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.. కథ రొటీన్ అయినా కూడా సౌండ్స్ మరియు హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టాడు.ఈ సినిమాలో ఆంథోనీ పాత్రలో శ్రీరామ్ అద్భుతంగా నటించారు.. ఆత్మల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా అతడి నటన మెప్పిస్తుంది. తాంత్రిక విద్యలు తెలిసిన మహిళగా ఈశ్వరీరావు చాలా వరకు ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నటించిన విధానం బాగుంది.ఆమె క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు కూడా మెప్పిస్తుంది. ఖుషి రవి నటన ఆకట్టుకుంటుంది.శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ నిడివి తక్కువే. పిండం హారర్ సినిమా లవర్స్‌ను మెప్పిస్తుంది. ప్యూర్ సినిమా చూసిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది.