టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ కామెడీ సినిమాని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలిలో ఈ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని వీడియోని షేర్ చేసి అధికారకంగా ప్రకటించారు.
గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొన్పూడి విశ్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa