ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డుంకీ' ఈ తేదీన డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందా?

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 12:30 PM

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'డుంకి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యింది. తాజా బజ్ ప్రకారం, ఈ ఫ్యామిలీ డ్రామా ఫిబ్రవరి 16, 2024న జియో సినిమాలో OTTలో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.

ఈ ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్ లో తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa