ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉత్సవం' నుండి ఫస్ట్ కిస్ సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 05:28 PM

అర్జున్ సాయి దర్శకత్వంలో దిలీప్ ప్రకాష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉత్సవం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా కథానాయుకురాలిగా నటిస్తుంది. సురభి డ్రామాపై ఇంపాక్ట్‌ఫుల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది.


ఈ చిత్రం నుండి ఫస్ట్ కిస్ అనే ఫస్ట్ సింగిల్‌ని మూవీ మేకర్స్ ఆవిష్కరించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కి అనూప్ రూబెన్స్ కంపోస్ చేసారు. రామ్ మిరియాల తన ప్రత్యేకమైన గానంతో పాటకు అదనపు ఉత్సాహాన్ని తెచ్చాడు.


ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి  అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa