సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా వస్తున్న మూవీ 'ఊరి పేరు భైరవకోన'. ఈనెల 16 థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వర్ష బొల్లమ్మ తన క్రష్ గురించి తెలిపారు. తనకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి అతడే తన క్రష్ అని చెప్పారు. పేపర్లోని కోహ్లీ ఫొటోలను కత్తిరించి దాచుకునేదానినని తెలిపారు.