కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'సింగపూర్ సెలూన్ ’ చిత్రం సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆర్‌జే బాలాజీ - మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రమిది. సత్యరాజ్, లాల్ కీలక పాత్రలు పోషించారు. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తమిళంలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి ప్రకటన లేకుండానే తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. సినిమాకు పాజిటివ్ టాక్ ఉండటంతో తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి రావడంతో త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పాటు అరవింద్ స్వామి, జీవా గెస్ట్ రోల్స్‌లో మెరిశారు. మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాలని, తన వ్యాపారాన్ని విస్తరించాలనే డ్రీమ్స్ ఉన్న యువకుడు పాత్రలో ఆర్‌జే బాలాజీ కనిపించారు. ఇంజినీరింగ్ చదివిన అతడు ఎందుకు సెలూన్ వృత్తిని కొనసాగిస్తాడే. పేద కుటుంబానికి చెందిన అతన్ని గొప్పింటి వర్గానికి చెందిన అమ్మాయి (మీనాక్షి చౌదరి) ఎలా ప్రేమలో పడింది..? ఈ క్రమంలో హీరోకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అన్నది ఇతివృత్తం.