తమిళనాడులో ఒక పార్టీ కి చెందిన రాజకీయ నాయకుడు ఎవి రాజు రెండు రోజుల క్రిందట నటి త్రిషపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో వున్న సంగతి తెలిసిందే. అతను చేసిన వ్యాఖ్యలను చాలామంది ఖండించటమే కాకుండా, త్రిషకి మద్దతుగా కూడా నిలిచారు. అతను చేసిన వ్యాఖ్యలకి తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత రావటంతో ఎఐఎడిఎంకె పార్టీకి చెందిన ఆ మాజీ నాయకుడు తన వ్యాఖ్యలకి త్రిషకి క్షమాపణలు చెప్పాడు. ఇంకొక వీడియో రాజు విడుదల చేస్తూ, అందులో నటి త్రిషని క్షమించమని అడిగాడు. తన మాటలు వక్రీకరించారని, తనకి త్రిషని టార్గెట్ చేసే ఉద్దేశం లేదని, కొందరు తాను అన్న మాటలని వక్రీకరించారని ఆ వీడియోలో చెప్పాడు రాజు. అలాగే దర్శకుడు చెరన్, నటుడు కరుణాస్ కి కూడా క్షమాపణలు చెప్పాడు ఆ వీడియోలో. రెండు రోజుల క్రితం రాజకీయనాయకుడైన రాజు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సాలెం వెస్ట్ ఎంఎల్ఏ వెంకటాచలం నుండి నటి త్రిష రూ. 25 లక్షల రూపాయలు సెటిల్మెంట్ కింద తీసుకున్నారు అని అన్నాడు. ఈ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన రాజుపై చర్య తీసుకోవాలని తమిళ చిత్రపరిశ్రమకి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ, త్రిషకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.తమిళ నటీనటుల సంఘం సెక్రటరీ విశాల్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. "నువ్వు ముష్టి ఎత్తుకొని నీ జీవనం మొదలుపెట్టు, అప్పుడు నీకు క్రమశిక్షణ అంటే ఏంటో అలవాటవుతుంది", అని చాలా తీవ్రస్థాయిలో రాజకీయ నాయకుడిపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలని త్రిష ఖండించారు, నయయపరమైన పోరాటానికి కూడా సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఎ వి రాజు తన వ్యాఖ్యలకి త్రిషని క్షమించమని ఒక వీడియో విడుదల చేశారు.