విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు. 'గామి' ప్రాజెక్ట్ లో మొదటి రోజు నుంచి వున్నాను. 'మను' సినిమా చేసినపుడు దర్శకుడు విద్యాధర్ గారు పరిచమయ్యారు. 'గామి' అంటే సీకర్.. తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. వారణాసి, కుంభమేళ, కాశ్మీర్, హిమాళయాలు.. ఇలా రియల్ లోకేషన్స్ లో ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరీంచాం. మా టీంలో నేను ఒక్కరే అమ్మాయిని. అందరం ఒక బస్ లో వెళ్లి సూర్యస్తమయం వరకూ షూటింగ్ చేసి వచ్చే వాళ్ళం. షూటింగ్ లో చాలా సవాల్ తో కూడిన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వలన నీరు కూడా తాగేదాన్ని కాదు. దాదాపు నెల పాటు ఇలా షూటింగ్ చేశాం. ఇందులో చూపించిన స్టంట్స్ రియల్ గా చేశాం. గడ్డకట్టిన మంచు పొరల మీద నడిచినప్పుడు పగుళ్ళు వచ్చాయి. పొరపాటున కిందపడితే ప్రాణానికే ముప్పు. అలాంటి సమయంలో నా దగ్గర ఉన్న లగేజ్ ని పారేసి జంప్ చేసి లక్కీగా బయటపడ్డాను. ఈ సినిమా ప్రయాణం అంతా ఒక సాహస యాత్రలా జరిగింది అని అన్నారు.