‘‘మురారి’, ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు నన్ను బాగా ప్రభావితం చేసి, నా కెరీర్‌ను మలుపు తిప్పాయి. డిఫరెంట్ స్టోరీ లైన్లతో తెరకెక్కించిన ఈ చిత్రాలు ఆడియన్స్ కు నన్ను మరింత దగ్గర చేశాయి. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయాలని నైతిక అంశాల ఆధారంగా కథను ఎంపిక చేసుకుంటాను. ఒకే రకమైన పాత్రల్లో నటించడం నాకు నచ్చదు. వ్యక్తిగత విలువలకు దగ్గరగా ఉంటూ, నా స్వభావాన్ని అభిమానులకు తెలియజేసేలా ఉన్న పాత్రలు పోషిస్తా. సినీ ఇండస్ట్రీలో విజయంపై నా ఆలోచనా విధానం మారింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ముఖ్యమైనప్పటికీ సినిమా ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నా. అందులో భాగంగానే ‘గుంటూరు కారం’లో నటించాను. ఈ చిత్రానికి సవాళ్లు ఎదురైనా ప్రేక్షకుల ఆదరణ పొందింది. నా అభిమానులే ఇందుకు అభిమానులు. ఒక సినిమాకు సైన్ చేశానంటే అది పూర్తయ్యేదాకా దర్శకుడి విజన ప్రకారమే నడుచుకుంటా’’ అని మహేశ్ బాబు అన్నారు.