బ్లెస్సీ రచన మరియు దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం' అనే సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఆడుజీవితం సినిమా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సినిమా ట్రైలర్ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. నా సోదరుడు పృథ్వీరాజ్, మీరు ఏమి చేసారు !!! వరదరాజ మన్నార్‌గా నటించిన వ్యక్తి మీరేనా. నేను నమ్మలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్. ది గోట్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నాను. బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది అంటూ పోస్ట్ చేసారు.
ఈ చిత్రంలో అమల పాల్ కథానాయికగా నటిస్తుంది. ఆడుజీవితం సినిమా ఇతర భాషల్లో “ది గోట్ లైఫ్” పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రంలో జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, రిక్ అబీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం మార్చి 28, 2024న విడుదల కానుంది.