శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా మార్చి 1, 2024న విడుదల అయ్యింది. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేసాడు. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 29, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.