బాలీవుడ్‌లోని సింగం సిరీస్ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫ్రాంచైజీలో తదుపరి చిత్రానికి 'సింగం ఎగైన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. సింఘం ఎగైన్‌లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, దర్శకుడు రోహిత్ శెట్టి ఈ చిత్రంలో అర్జున్ కపూర్‌ను విలన్‌గా ఎంచుకున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో అర్జున్ కపూర్ పాత్రకు డేంజర్ లంక అని పేరు పెట్టారు. రోహిత్ శెట్టి ప్రతినాయకుడి పాత్రను ప్రేక్షకులకు షాక్ ఇచ్చే రీతిలో డిజైన్ చేశాడని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అర్జున్ కపూర్ ఫస్ట్-లుక్ పోస్టర్ గత వారం రివీల్ చేయబడింది. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ మరియు దేవగన్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం 2024 ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది.