టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ రైటర్ పద్మభూషణ్ మరియు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఇప్పుడు, ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రసన్న వదనంలో సుహాస్ కనిపించనున్నాడు. తాజగా జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా, చాలా మంది ఊహాగానాలు చేసిన విషయాన్ని నటుడు ధృవీకరించాడు. అతని పారితోషికం ఒక్కో సినిమాకి 2.5 కోట్లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సుహాస్ తన ప్రధాన పాత్రలతో పాటు, ఇతర చిత్రాలలో సహాయక పాత్రలకు సైన్ చేస్తున్నాడు.