ఓవైపు దేశభక్తి మరోవైపు రక్తితో కూడిన రెండు విభిన్న పాత్రలతో వారం రోజుల లోపే రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ గారాల పట్టిగా 2018లో హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల సుందరి అచీతూచి తన కేరీర్‌ను డెవలప్ చేసుకుంటుంది.అందానికి అందం, నటన, గ్లామర్ విషయంలో మోహమాటం ఏ మాత్రం లేని ఈ చిన్నది రొజురోజుకు పరిశ్రమలో తన పేరును సుస్థిరం చేసుకుంటోంది. తన ఈడు వయస్సున్న జాన్వీ కపూర్, అనన్యాపాండే గట్టి పోటీ ఇస్తున్నా వాళ్లను అధిగమించి సారా తనదై నశైలిలో సినిమాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంటోంది.గత సంవత్సరం విక్కీ కౌశల్‌తో చేసిన జర హట్కే.. జర బచ్కే చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించగా ఈ సంవత్సరం ప్రధమార్ధంలోనే ఒకటే నెలలో వారం వ్యవధిలో రెండు చిత్రాలతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో ఒకటి మిస్టరీ థ్రిల్లర్ జానర్లో వస్తున్న మర్డర్ ముబారక్ కాగా రెండోది దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న అయే వతన్ మేరే వతన్. ఈ రెండు కూడా కేవలం 7 రోజుల వ్యవధిలో విడుదల అవుతుండగా ఆ రెండు డైరెక్ట్ ఓటీటీలోనే స్ట్రీమింగ్కు రానుండడం విశేషం.