సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే ఙ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేట్టయ్యన్’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన తలైవర్‌కు జీవితాంతం రుణపడివుంటానని నటి రితికా సింగ్ అన్నారు. ఇదే విషయంపై ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘సూపర్‌స్టార్ రజినీకాంత్‌లోని ప్రేమ, దయాగుణం సాటిలేనివి. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె రజినీకాంత్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. కాగా ‘వేట్టయ్యన్’ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, తుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరునెల్వేలి, కన్నియాకుమారి తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ 70 నుంచి 80 శాతం మేరకు పూర్తయినట్టు ఇటీవల హీరో రజినీకాంత్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ మరో రెండు మూడు చిత్రాలను కమిటై ఉన్నారు. అందులో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం కూడా ఉంది. రజినీ, లోకేష్ కాంబోలో తెరకెక్కాల్సిన చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. రితికా సింగ్ విషయానికి వస్తే.. ఈ మధ్య ఈ భామకు వరుస అవకాశాలు వరిస్తున్నాయి. అందుకు కారణం మాత్రం సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు, ఫొటోలే అని చెప్పుకోవచ్చు.