వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం, మూవీ టీమ్ నాని పాల్గొన్న కొన్ని కీలక మరియు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను క్యాన్ చేస్తోంది. షూటింగ్ స్పాట్ నుండి నాని వర్కింగ్ స్టిల్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు.
ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్టైన్మెంట్కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.