గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ క్యాస్టింగ్ కౌచ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న కస్తూరి తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంది.. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్డం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని ఒప్పుకోరు. అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. తాజా ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ దీనిపై ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ... క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. గతంలో నేను వీటి గురించి మాట్లాడాను కూడాను. అందుకు ఒప్పుకోలేదని సినిమాల్లో నుండి తీసేశారు. ఎపిసోడ్స్ లేపేశారు. తెలుగులో అలాంటి అనుభవం లేదు. తమిళంలో చూశాను. మలయాళంలో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి నాకు పెళ్లైంది. ఎలాగొలా బయటపడ్డాను. మలయాళంలో అది నా కమ్ బ్యాక్ మూవీ. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. దానికి ఒప్పుకోలేదని తీసేశారు. ఇప్పుడు మలయాళ పరిశ్రమ బాగుంది. అన్నిరంగాల్లో ఈ తరహా అనుభవాలు అమ్మాయిలకు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఒక బిల్డింగ్ కడుతుంటే... మేస్త్రికి కూలీకి మధ్య ఎఫైర్స్ ఉంటాయి. ప్రతిచోటా లైంగిక వేధింపులు తప్పవు. అయితే అందరూ అలాంటి వాళ్ళు కాదు. లంచం తీసుకునేవాళ్ళు ఉంటారు... తీసుకోని వాళ్ళు ఉంటారు. చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు. నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అలా అని నేను పరిశ్రమను వదిలి వెళ్లిపోలేదు కదా. 80 సినిమాలు చేశాను. అందరూ చెడ్డవారు అయితే నేను చేయగలిగేదానిని కాదు కదా.
ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయి. చెడు మంచి అన్ని చోట్లా ఉంటుంది. అందువలన చిత్ర పరిశ్రమను తప్పుబట్టడానికి వీల్లేదు. మనకు ఎదురైన అనుభవాలను ఎలా ఫేస్ చేశాం అనేదే ముఖ్యం... అని కస్తూరి అన్నారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.