తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత యాంకర్‌గా మారి బిజీ అయింది. అయితే శ్రీముఖి పెళ్లి గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆమె పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'శ్రీముఖి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. నచ్చిన కుర్రాడు దొరికితే ఈ ఏడాది ఆమె పెళ్లి అయిపోతుంది.' అని ఓ ఇంటర్వ్యూలో అవినాశ్ తెలిపాడు.