కుమారస్వామి దర్శకత్వంలో చైతన్య రావు మాదాడి నటించిన 'షరతులు వర్తిస్తాయ్' సినిమాని కరీంనగర్‌లోని దిగువ మధ్యతరగతి కుటుంబ జీవితాల కథాంశంగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో చైతన్యరావుకి జోడిగా శెట్టి భూమి నటిస్తుంది. ఈ చిత్రంలో సుధాకర్, రాజేష్, సన్నీగా సాయి, వెంకీ మంకీ, శివ కళ్యాణ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ ప్రై.లి. లిమిటెడ్ నిర్మిస్తుంది.