ప్రతి సినిమాల్లో విలన్ను చంపేస్తుంటారని, సినిమాల్లో ప్రతి నాయకుడు అనేవాడు చనిపోకూడదని దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘మళై పిడిక్కాద మణిదన్’ తెలుగులో తుఫాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ ఆంటోనీ హీరో, మేఘా ఆకాష్ హీరోయిన్. శరత్ కుమార్, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు ధనుంజయన్, నటి మేఘా ఆకాష్, నటుడు సత్యరాజ్, హీరో విజయ్ ఆంటోనీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ, ‘ఇది ఒక యాక్షన్ చిత్రమే కాదు. ఇది పొయెటిక్ యాక్షన్ జానర్. ఈ మాట నేను చెప్పడం లేదు. నిర్మాత ధనుంజయన్ అంటున్నారు. నా చిత్రాల్లో విలన్ చావకూడదు. చంపేయడమే చెడు సంప్రదయామన అన్నారు. సత్యరాజ్ వంటి టాలెంటెడ్ నటుడిని నేను ఇప్పటి వరకు చూడలేదని, శరత్ కుమార్లో మంచి నాయకత్వ లక్షణాలున్నాయని.. ఆయన సూర్యవంశం సినిమా నుంచి బాగా తెలుసని కథ విన్న వెంటనే నటించేందుకు ఓకే చెప్పారన్నారు. మేఘా ఆకాష్, టెక్నికల్ టీం ఎంతగానో సహకరించారు’ అన్నారు.