ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధూమ్ ధామ్' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 02:16 PM

యువ నటుడు చేతన్ కృష్ణ ధూమ్ ధామ్ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ మల్లెపూల టాక్సీ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో జూన్ 5, 2024న ఉదయం 9:18 గంటలకు విడుదల కానుంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాయగా, గోపి సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ ఆకట్టుకునే కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ధూమ్ ధామ్ వేసవికి విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa