ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూర్య44' నుండి సూర్య ఫస్ట్ లుక్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 02:22 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా నటుడి కెరీర్‌లో 44వ చిత్రం. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే నటిస్తుంది. తాజాగా ఇప్పుడు, మూవీ టీమ్ షూటింగ్ ప్రారంభించింది మరియు అదే విషయాన్ని తెలియజేయడానికి వారు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం నుండి సూర్య యొక్క అద్భుతమైన మరియు మాస్ లుక్ ఈ వీడియో ద్వారా ఆవిష్కరించబడింది మరియు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జయ రామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa