వీర సింహారెడ్డి విజయం తరువాత టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజతో ఒక ప్రాజెక్ట్ను ప్రకటించాడు. చివరికి ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు, దర్శకుడు తన కొత్త ప్రాజెక్ట్ ని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ బ్యానర్లు మైత్రి మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ టెంపరరీ గా ఎస్డిజిఎమ్ అనే టైటిల్ ని లాక్ చేసారు. హైదరాబాద్లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. చిత్ర బృందంతో పాటు దగ్గుబాటి సురేష్, వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల, సాయి రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ కథానాయికలుగా నటించనున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, థమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.