బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన లాంగ్ టర్మ్ బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను ముంబైలోని ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుంది. ఒక స్టార్ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. సోనాక్షి రెడ్ కలర్ చీరలో అందంగా కనిపించింది. ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ చీర సోనాక్షి తల్లి పూనమ్ సిన్హాది అని కొందరు అంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఆ చీర రా మ్యాంగో అనే బ్రాండ్‌కి చెందినది. ఈ చీర ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంది మరియు దీని ధర 79,800 రూపాయలు. సోనాక్షి సిన్హా ఇప్పుడు ముంబైలో కొన్ని నెలల క్రితం కొనుగోలు చేసిన తన కొత్త ఇంటికి మారనుంది.