హిందీ హారర్-కామెడీ ముంజ్యా మాడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో తాజా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. విజయవంతమైన స్త్రీ, రూహి మరియు భేదియా తర్వాత ఫ్రాంచైజీలో ఇది నాల్గవ చిత్రం. పెద్దగా హైప్ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడవ వారంలో 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ చిత్రంలో ప్రముఖ తారలు ఎవరూ లేకపోవడం విశేషం. మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ ఈ హారర్-కామెడీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శర్వరి, అభి వర్మ, మోనా సింగ్ మరియు సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.