తనపై వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్స్ పై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించారు. “పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే.. ఇకపై మేము హాస్పిటల్ కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు. ఇదొక్కటే ఆలోచనలో ఉంటున్నారు” అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.