బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో ఒకే సంవత్సరంలో రెండు 1000 కోట్ల గ్రాసర్లను సొంతం చేసుకున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డుంకీ మంచి బిజినెస్ చేసింది కానీ సినిమా పూర్తిగా అంచనాలను అందుకోలేకపోయింది. షారుఖ్ తదుపరి ప్రాజెక్ట్‌కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి కింగ్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ ప్రాజెక్ట్ తో SRK కుమార్తె సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేస్తుంది. జూలై లేదా ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని షారుఖ్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. విలన్ పాత్ర కోసం కింగ్ మేకర్స్ సౌత్ ఇండియన్ యాక్టర్‌ని తీసుకోవాలని ప్రయత్నిస్తునట్లు లేటెస్ట్ టాక్. నిర్మాతలు సౌత్ సినిమాలోని కొంతమంది పెద్ద పేర్లతో చర్చలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు మరియు విలన్‌గా ఎవరు నటిస్తారో చూడాలి. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరోసారి డాన్ పాత్రలో నటిస్తున్నాడు.