కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన పాటలు కాపీ కొట్టారని పేర్కొంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయ ఎల్లిదే, గాలిమాతు చిత్రాల్లోని పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ 'బ్యాచిలర్ పార్టీ'లో కాపీ కొట్టారని ఫిర్యాదులో తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై స్పందించమని కోరుతూ రక్షిత్కు నోటిసులు జారీ చేశారు.