నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. ‘రాజావారు రాణిగారు’ సమయం నుంచి నిశ్చితార్థమైన నాటివరకూ వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలు, వీడియోలతో స్పెషల్ వీడియో క్రియేట్ చేసి దాన్ని అభిమానులతో రహస్య పంచుకున్నారు. ‘‘హ్యాపీ బర్త్డే కిరణ్ అబ్బవరం. మరో 38 రోజుల్లో నిన్ను. మై హస్బెండ్ అనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.