తెలుగు అమ్మాయి వేద అర్చన హీరోయిన్గా పలు విమర్శకుల ప్రశంసలందుకునే సినిమాలు చేసింది. కమర్షియల్ విజయాలు అందుకుంది. అవార్డులు సొంతం చేసుకుంది. `తపన` చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `నేను` సినిమాతో మెప్పించింది. `కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను` చిత్రంతో కమర్షియల్‌గా విజయాన్ని సాధించింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`లో త్రిషకి ఫ్రెండ్ గా మెరిసి ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది.
హీరోయిన్‌గానే కాకుండా సెకండ్ లీడ్‌గా, కీలక పాత్రల్లోనూ నటించి మెప్పించింది అర్చన. `శ్రీరామదాసు`, `పౌర్ణమి`, `సామాన్యుడు`, `యమదొంగ`, `పాండురంగడు`, `ఖలేజా`, `పరమవీర చక్ర`, `బలుపు`, `కమలతో నా ప్రయాణం`, `పంచమి`, `లయన్` వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల `కృష్ణమ్మ` సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది. హీరోయిన్‌గానే కాకుండా సెకండ్ లీడ్‌గా, కీలక పాత్రల్లోనూ నటించి మెప్పించింది అర్చన. `శ్రీరామదాసు`, `పౌర్ణమి`, `సామాన్యుడు`, `యమదొంగ`, `పాండురంగడు`, `ఖలేజా`, `పరమవీర చక్ర`, `బలుపు`, `కమలతో నా ప్రయాణం`, `పంచమి`, `లయన్` వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల `కృష్ణమ్మ` సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది.
ఓ హీరో తన మెసేజ్‌కి రిప్లై ఇవ్వనందుకు సినిమా నుంచి తీసేశారని తెలిపింది. మలయాళంలోనూ ఓ సినిమా విషయంలో ఇలానే జరిగిందని, తెలుగులోనూ అలాంటి అనుభవాలున్నట్టు తెలిపింది. వాళ్ల పేరు చెప్పడానికి నిరాకరించిన అర్చన.. ఓ అవార్డు ఈవెంట్లో ఓ హీరో తనకు అవార్డు ఇచ్చేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆమెకి అవార్డుని తాను ఇవ్వను అని స్టేజ్ నుంచే దిగిపోయినట్టు తెలిపింది వేద అర్చన. ఈ ఘటనలు చాలా బాధ పెడతాయని, కానీ ఈ రంగంలో ఇలాంటివి కామనే అని చెప్పింది.తనకు నటనపై ఆసక్తి ఉందని, బాగా నటిస్తానని కొంత మంది అనుకుంటారు. అలాంటి మంచి పాత్రలు, మంచి సినిమాలు ఇస్తారు. కానీ కొందరు ఈ అమ్మాయికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఒకసారి టచ్ చేసి చూద్దాం, మెసేజ్ పెట్టి చూద్దాం, కుదిరితే ఆఫర్ ఇద్దాం అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా అసహ్యంగా ఉంటుందని, బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది అర్చన.