మరోసారి తల్లి కాబోతోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్. ఈ కాలంలో పెళ్ళి లేటుగా చేసుకుని.. పిల్లల్ని ఇంకా లేటుగా కంటున్నారు హీరోయిన్లు. కాని ఈబ్యూటీ మాత్రం వెంట వెంటనే పిల్లల్ని కనేస్తోంది. ఈమధ్యలో చాలా మంది హీరోయిన్లు పెళ్ళిల్లు వరుసగా జరిగిపోయాయి. పెళ్లిళ్లు మాత్రమే కాదు వెంటనే పిల్లలు కూడా కనేస్తున్నారు. సాధారణంగా సినిమా హీరోయిన్లు పెళ్లయిన వెంటనే పిల్లలు కనేందుకు పెద్దగా ఇష్టపడరు. కాని ఈమధ్య యంగ్ హీరోయిన్లు తొందరగా పెళ్ళి చేసేసుకుంటున్నారు.. వెంటనే పిల్లలను కనడానికి ఆరటపడుతున్నారు. అంతే కాదు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్స్ అయినవారు కూడా ఉన్నారు. చాలా మంది హీరోయిన్లు ఒకవేళ బిడ్డను కన్నా కూడా ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఓ హీరోయిన్ సూపర్ ఫాస్ట్ తా ఉంది. వెంట వెంటనే బిడ్డల్ని కనేస్తోంది.ఆమె ఎవరో కాదు హీరోయిన్ ప్రణీత సుభాష్. అందరికంటే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తోంది ప్రణీత. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ పెళ్ళి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది. బెంగళూరుకు చెందిన కన్నడ డాక్టర్స్ ఫ్యామిలీలో జన్మించిన ప్రణీత.. 2010లో కన్నడ మూవీ పోర్కితో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది, తొలి సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హోదాను అందుకుంది. ఇక వెంటనే లేట్ చేయకుండా.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈచిన్నది.. ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. ఇక వరుసగా బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో తెగ హడావిడి చేసింది.
ప్రణీత.. 2021 మే 30న బిజినెస్ మేన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది.ఈ దంపతులకు 2022 జూన్ లో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అయితే పాప పుట్టిన రెండేళ్లకే.. మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది ప్రణీత. తాజాగా ఈ గుడ్‌న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది బ్యూటీ. తాను మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. రౌండ్ 2.. స్టార్ట్ అయ్యింది. ఇక ఈ ప్యాంట్స్ సరిపోవడం లేదు అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ప్రణీత సోషల్ మీడియా ద్వారా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ న్యూస్ చూసి ఆమె ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొద్ది నెలలకు ఆన్ స్క్రీన్ కు దూరంగా ఉన్న ప్రణీత.. ఈ ఏడాది ఆరంభంలో తంకమణి అనే మలయాళ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రమణ అవతార అనే కన్నడ మూవీలో మెరిసింది. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్: కథానాయకుడు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీలో ఆమె ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించింది.
#Pranitha pic.twitter.com/9shRhqjD4m
— Eye4cine (@Eye4u) July 25, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa