తమిళ అగ్రహీరో ధనుష్‌పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) అగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాక, అతని విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.కొందరు నిర్మాతల దగ్గర అధికమొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని, షూటింగ్స్‌కి సహకరించడంలేదన్నది ధనుష్‌పై అభియోగం. దీనిపై టీఎఫ్‌పీసీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది.సమావేశంలో తమిళ సినిమా అభ్యున్నతి కోసం కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, అలాగే ఈ ఏడాది నవంబర్ 1 నుంచి సినిమా సంబంధిత కార్యకలాపాలను కూడా ఆపివేయాలని నిర్ణయించింది.ఇందులో భాగంగానే హీరో ధనుష్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.కొత్త సినిమాలకు ధనుష్‌ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని కౌన్సిల్ కోరింది.ఇలా ధనుష్ చాలామంది నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు అందుకున్నందున, నటుడు ధనుష్‌తో కొత్త సినిమాను ప్రారంభించే ముందు సదరు నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను సంప్రదించాలని కోరారు. హీరో ధనుష్‌కి ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి.