వివాహానంతరం తెరపై భార్యాభర్తలుగా కనిపించే ఒక కథతో తమిళ హీరో ఆర్య..సాయేషాసైగల్ ప్రేక్షకులను పలకరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తమిళంలో శక్తి సౌందరరాజన్ ‘టెడ్డీ’ అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కథలో ఈ జంట ఫస్టాఫ్ లో ప్రేమికులుగా .. ఆ తరువాత భార్యాభర్తలుగా కనిపిస్తారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa