రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య మరోసారి ఆందోళనకు దిగింది.రాజ్ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేసింది.ప్రేయసి లావణ్య.. తన భర్త తనకు కావాలన్నారు. కొందరు వ్యక్తులు అతడిని కలవనీయకుండా అడ్డుకుంటున్నారని లావణ్య ఆరోపించింది.హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో తిరగబడరసామీ ప్రీరిలీజ్‌వేడుక జరిగింది. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్ర సహా చిత్ర బృందం ఈ ఈవెంట్లో పాల్గొంది. పంక్షన్ జరిగే ప్రసాద్ ల్యాబ్ దగ్గరకు వెళ్లిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు.ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇంటి వద్దకు కూడా వెళ్లి ఆందోళనకు దిగింది లావణ్య.ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పై ఆధారాలతో వెళ్లిన లావణ్య.. రాజ్‌తరుణ్ ఎక్కడున్నా రావాలని డిమాండ్ చేసింది.ఇదిలాఉంటే.. తాను లావణ్య విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చానన్నారు నటుడు రాజ్ తరుణ్.పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చానన్నారు. తన అమాయకత్వాన్ని.. మంచి తనాన్ని ఆసరాగా తీసుకొని నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు.